Homeటాప్ స్టోరీస్సైకలాజికల్ థ్రిల్లర్ చేస్తోన్న టాప్ కమెడియన్స్

సైకలాజికల్ థ్రిల్లర్ చేస్తోన్న టాప్ కమెడియన్స్

సైకలాజికల్ థ్రిల్లర్ చేస్తోన్న టాప్ కమెడియన్స్
సైకలాజికల్ థ్రిల్లర్ చేస్తోన్న టాప్ కమెడియన్స్

కమెడియన్స్ ఇప్పుడు కేవలం కామెడీకే పరిమితమవ్వట్లేదు. నటుడు సునీల్ అయితే ఎప్పుడో కామెడీని వదిలేసాడు. సీరియస్ పాత్రలను ట్రై చేసి అది వర్కౌట్ అవ్వక మళ్ళీ కామెడీ వైపు తొంగి చూసాడు. ఇక ఇప్పుడు అన్ని రకాల పాత్రలూ చేస్తున్నాడు. సునీల్, మరో పేరున్న కమెడియన్ ధనరాజ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు.

వీరిద్దరూ హీరోలుగా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. బుజ్జీ ఇలారా అనే ఆసక్తికర టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు అనౌన్స్ చేసారు. ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

గరుడవేగ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన అంజి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. బుజ్జి ఇలారా చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే బయటకు వస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All