
సినీ నటుడు సునీల్..జనసేన పార్టీ లో చేరబోతున్నారని , భీమవరం నుండి ఆయన బరిలోకి దిగబోతున్నట్లు నిన్నటి నుండి సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తలు చూసి చాలామంది నిజమేనా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ వార్తలపై సునీల్ క్లారిటీ ఇచ్చారు.
‘‘తాజాగా నేను జనసేన పార్టీలోకి వెళ్తున్నట్టుగా గాసిప్‌లు వస్తున్నాయి. నాకు రాజకీయాలంటే టచ్ లేదు.. నేను పాలిటిక్స్‌కి క్వాలిఫైడ్ పర్సన్‌ని కాదు.. కానీ పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ఆయన నాకు బాగా క్లోజ్.. ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయనకి నిజంగానే మనసులో ఉంది.. నన్ను పార్టీలోకి తీసుకోవాలి.. కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనకి జనాభా ఎక్కువ.. ఫండ్స్ తక్కువ.. ఈ ఫండ్స్‌ని అటూ ఇటూ అడ్జెస్ట్ చేయాలి.. ఈ అడ్జెస్ట్‌మెంట్‌లో అందరికీ న్యాయంచేయలేం. న్యాయం జరగనివాళ్లు ఫీల్ అవుతారు. ఈ ప్రాసెస్‌లో మనం ఎవర్నీ సంతృప్తి పరచలేం. అలాంటప్పుడు మనం ఒకరితో మాట ఎందుకు అనిపించుకోవాలని నాకు ఉంటుంది. నాకు అన్నయ్య చిరంజీవి గారు కానీ.. కళ్యాణ్ గారు కానీ ప్రోత్సహించడానికి రెడీగా ఉంటారు.. కానీ మనం వస్తే చప్పట్లు కొట్టి విజిల్స్ వేయాలి.. అలాంటి పరిస్థితి లేనప్పుడు బాధగా ఉంటుంది.
అందుకే కళ్యాణ్ గారు అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను. నాకు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం.. ఆయనకి నా వంతుగా ఏదైనా చేయగిలిగినప్పుడు మాత్రం తప్పుకుండా చేస్తాను. అయితే అది రాజకీయంగా కాదు. ఎందుకంటే నాకు రాజకీయం అంటే ఏంటో తెలియదు.. నేను రాజకీయాలు సూట్ కాను.. క్వాలిఫైడ్ పర్సన్‌ని కాదు’ అంటూ తన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.