Homeటాప్ స్టోరీస్ఆర్ ఎక్స్ 100 రీమేక్ బాలీవుడ్ లో

ఆర్ ఎక్స్ 100 రీమేక్ బాలీవుడ్ లో

Suniel shetty son Ahan shetty debut in hindi with RX 100టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన చిత్రం ఆర్ ఎక్స్ 100 . బాలీవుడ్ భామ పాయల్ రాజ్ పుత్కార్తికేయ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు అంతగా అంచనాలు లేవు కానీ ఎప్పుడైతే ట్రైలర్ విడుదల అయ్యిందో అప్పటి నుండి ఆర్ ఎక్స్ 100 చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి . కట్ చేస్తే సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది . ఇంకేముంది ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని పలు బాషలలో రీమేక్ చేయడానికి పలువురు పోటీ పడ్డారు . ఇక ఈ బోల్డ్ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ వాళ్ళు సైతం రీమేక్ చేయడానికి పోటీ పడి హక్కులు సాధించుకున్నారు .

బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ని హీరోగా పరిచయం చేయనున్నాడు బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా . పలు హిట్ చిత్రాలను నిర్మించిన సాజిద్ ఇప్పుడు సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ని హీరోగా పరిచయం చేస్తూ ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడు . అసలే బోల్డ్ మూవీ అందునా బాలీవుడ్ లో రీమేక్ అంటే ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో కొత్తగా చెప్పడానికి ఏముంది , యువతకు కావాల్సినంత మసాలా అన్నమాట .

- Advertisement -

English Title: Suniel shetty son Ahan shetty debut in hindi with RX 100

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All