
టాలీవూడ్ లో వెడ్డింగ్ ల హంగామా నడుస్తోంది. ఎప్పుడు పెళ్లంటే ముఖం చాటేసిన యంగ్ స్టార్స్ అంతా ఇప్పుడు పెళ్ళికి సిద్ధమైపోయారు. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోగా యంగ్ హీరోలు నిఖిల్ , నితిన్ , రానా ఇటీవలే వివాహాలు చేసుకున్నారు. యంగ్ డైరెక్టర్, ‘ సాహో ‘ ఫెమ్ సుజీత్ కూడా ఇటీవలే వివాహం చేసుకున్నారు.
వీరితరహాలోనే మరో యంగ్ హీరో కూడా పెళ్లి పీట లెక్కబోతున్నాడు. యంగ్ హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జీవితంలో చాలా విషయాలను వెనక్కితిరిగి చూసుకునేలా చేసిందని, తనకు సంతోషాన్నిచ్చే విషయాల గురించి ఆలోచించేలా చేసిందని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. తన జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్నిచిందని ee సందర్భంగా పేర్కొన్నారు.
ఈ పోస్ట్ కు మెన్ ఇన్ లవ్ అనే సింబల్ ని జత చేయడం గమనార్హం. తాను లవ్ లో వున్నానని ఇండైరెక్ట్ గా వెల్లడించిన సందీప్ కిషన్ సోమవారం aa గుడ్ న్యూస్ ని అందరితో షేర్ చేసుకుంటానని వెల్లడించడం ఆసక్తి కరంగా మారింది. సందీప్ కిషన్ ప్రస్తుతం ‘ఏ 1 ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.
- Advertisement -