Homeటాప్ స్టోరీస్సందీప్ కిషన్ గల్లీ రౌడీ చూపు ఓటిటి వైపు

సందీప్ కిషన్ గల్లీ రౌడీ చూపు ఓటిటి వైపు

సందీప్ కిషన్ గల్లీ రౌడీ చూపు ఓటిటి వైపు
సందీప్ కిషన్ గల్లీ రౌడీ చూపు ఓటిటి వైపు

సందీప్ కిషన్ ఈ ఏడాది ఏ1 ఎక్స్ ప్రెస్ తో డీసెంట్ విజయాన్ని సాధించాడు. హాకీ నేపధ్యమున్న ఈ చిత్రం సందీప్ కు మంచి పేరే తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం సందీప్ చేస్తోన్న చిత్రం గల్లీ రౌడీ, ముందుగా దీనికి రౌడీ బేబీ టైటిల్ ను ఫిక్స్ చేసారు కానీ వివిధ కారణాల వల్ల టైటిల్ మార్చాల్సి వచ్చింది.

నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం మొదట థియేటర్లలోనే విడుదల కావాల్సి ఉన్నా ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో ఓటిటి రిలీజ్ అయితే బెటర్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక భారీ ఓటిటి సంస్థతో టాక్స్ నడుస్తున్నాయి.

- Advertisement -

అది కనుక ఓకే అయితే నారప్ప, దృశ్యం2 తరహాలో మరో సినిమా కూడా ఓటిటి బాట పట్టనుంది. ప్రస్తుతం పలు చిత్రాలు ఇదే కోవలో నడుస్తున్నాయి. జి నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేసిన గల్లీ రౌడీ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All