Homeటాప్ స్టోరీస్2019 తెనాలి రామకృష్ణ గారి...A1 ఎక్స్‌ప్రెస్‌ జోరుమీదుంది.

2019 తెనాలి రామకృష్ణ గారి…A1 ఎక్స్‌ప్రెస్‌ జోరుమీదుంది.

2019 తెనాలి రామకృష్ణ గారి...A1 ఎక్స్‌ప్రెస్‌ జోరుమీదుంది.
2019 తెనాలి రామకృష్ణ గారి…A1 ఎక్స్‌ప్రెస్‌ జోరుమీదుంది.

తెనాలి రామకృష్ణ అంటే మనకి ‘కృష్ణ దేవరాయల’ కాలం నాటి గొప్ప కవి అని అంటాము. కానీ ఈ 2019 యుగం తెనాలి రామకృష్ణ అంటే “సందీప్ కిషన్” అంటాము. మొన్ననే కదా మనం తన తదుపరి సినిమా గా రాబోతున్న సినిమా అని ట్రైలర్ చూసేసాం. ఇప్పుడు ఇంకొక సినిమాని పట్టాలెక్కించేసాడు. మరి ఆ సంగతి ఏంటో చూద్దాం పదండి.

ఆల్రెడీ ఈ సంవత్సరం ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ద్వారా మన ముందుకి వచ్చాడు. సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డల్ అయిపోయింది. అయితే ఈ సారి కామెడీ ని నమ్ముకుందాం అని చెప్పి కామెడీ సినిమాల సృష్టికర్త “జి.నాగేశ్వర రెడ్డి” దర్శకత్వంలో హన్సిక తో జతకడుతూ చేస్తున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్’ తొందరలో మన ముందుకి రాబోతుంది.

- Advertisement -

ఆ సినిమా విడుదల అవ్వకముందే ఇంకొక సినిమాకి కొబ్బరిక్కాయ కొట్టేసాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ వేంకటాద్రి టాకీస్ మరియు అభిషేక్ అగర్వాల్ నిర్మాణ అధినేతలు అయిన టి.జి.విశ్వా ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్, దయా పన్నేం గారితో కలిసి అలాగే తను కూడా నిర్మాతగా మారి తను నటిస్తున్న కొత్త సినిమాని ప్రారంభించాడు ఆ సినిమా పేరు “A1 ఎక్స్‌ప్రెస్‌”. సినిమాకి దర్శకులుగా ‘డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను’.

అలా తన కొత్త సినిమా పోస్టర్ ఒకటి విడుదల చేసాడు. అందులో హాకీ స్టిక్ పట్టుకున్న సందీప్ కిషన్ స్టేడియం ముందు అటు తిరిగి ఉన్నాడు. చూస్తుంటే ఇదేదో న్యూ ఏజ్ స్పోర్ట్స్ డ్రామ గా తెరకెక్కబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకి తమిళ సంగీత దర్శకులు ‘హిప్ హాప్ తమిజ’ గారు పాటలని అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All