
మెగాస్టార్ చిరంజీవి డాన్స్ అంటే ఇష్టపడని వారు లేరు. చిరు డాన్స్ చూసే చాలామంది ఇండస్ట్రీ లో అడుగుపెట్టడం..డాన్స్ లు నేర్చుకోవడం వంటివి చేసారు. ఇప్పటికే ఎంతో మంది చిరు డాన్స్ గురించి తెలుపగా..తాజాగా సీనియర్ నటుడు సుమన్ తనకు చిరంజీవి డాన్స్ అంటే ఇష్టమని తెలిపారు.
సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ” నాకు కమలహాసన్ గారు అంటే చాలా ఇష్టం. అయినా డాన్స్ విషయానికొస్తే చిరంజీవిగారి డాన్స్ నచ్చుతుంది. చిరంజీవిగారు నేల చూడకుండా డాన్స్ చేస్తారు. ఆయన డాన్స్ చేసేటప్పుడు ఆయన బాడీలో ఒక రిథమ్ ఉంటుంది .. ఒక గ్రేస్ ఉంటుంది. చాలా మంది కుర్రాళ్లు ఇప్పుడు అంతకంటే ఫాస్టుగా చేస్తున్నారు. అయితే వాటిలో జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. చిరంజీవి తరువాత అంత బాగా డాన్స్ చేసే హీరోగా ఎన్టీఆర్ కనిపిస్తాడు” అని చెప్పుకొచ్చారు.