
టాలీవుడ్ లోనూ.. కొత్త ట్రెండ్ మొదలైంది. ఎంత వర్క్ చేసినా.. క్రెడిటే ఇవ్వరు అని క్రియేటర్లు ఫీల్ అయ్యే రోజుల నుంచి.. ఇద్దరు కలిసి సినిమా చేసే మెచ్యూరిటీకి వచ్చేస్తున్నారు. క్రెడిట్స్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్ అంటున్నారు..యంగ్ డైరెక్టర్స్ అనిల్ పురేటి అండ్ స్రవంతి మురళీ.
సులోచన సమయం ఆసన్నం అనే క్లాసిక్ టచ్ ఉన్న టైటిల్ తోనే ఫుల్ మార్కులు కొట్టేశారు యంగ్ డ్యుయో. పోస్టర్ తోనే ఈ సినిమా రెగ్యులర్ కాదు.. సమ్ థింగ్ ఏదో చెప్పబోతున్నారు అనే ఇంట్రస్ట్ క్రియేట్ చేశారు. యూనిక్ సబ్జెక్ట్ కావడంతో.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. సరస్వతి స్రవంతి అనే బ్యానర్ లో, యావే ప్రొడ్యూస్ చేస్తుండగా.. అనిల్ పురేటి, స్రవంతి మురళి డైరెక్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ స్లమ్ గర్ల్ సులోచన సమయం ఆసన్నం అనే సినిమా పోస్టర్ ను.. గుడుంబా శంకర్ మూవీ డైరెక్టర్ వీర శంకర్ లాంచ్ చేశారు.
దిక్సూచీ మూవీ ఫేమ్ దిలిప్ కుమార్, శ్వేతా వర్మ, కన్నడ హీరో శ్రీజిత్, రాకేశ్ ఏ, తమ్ముడు రమేశ్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. మూడు భాషల్లో రాబోతున్న స్లమ్ గర్ల్ సులోచన సమయం ఆసన్నం మూవీ రిలీజ్ కి కూడా సమయం ఆసన్నం అయింది అంటున్నారు క్రియేటర్స్. కథా బలాన్నే నమ్ముకుని అతి త్వరలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అంటున్నారు.