Homeటాప్ స్టోరీస్సుకుమార్ రైటింగ్స్ వ్యవహారాలు సొంత గూటికే!

సుకుమార్ రైటింగ్స్ వ్యవహారాలు సొంత గూటికే!

సుకుమార్ రైటింగ్స్ వ్యవహారాలు సొంత గూటికే!
సుకుమార్ రైటింగ్స్ వ్యవహారాలు సొంత గూటికే!

అగ్ర దర్శకుడు సుకుమార్ విభిన్నమైన కాన్సెప్ట్ లను ప్రమోట్ చేయడానికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ను స్థాపించిన విషయం తెల్సిందే. ఈ బ్యానర్ ద్వారా విభిన్నమైన చిత్రాలను ప్రమోట్ చేస్తున్నాడు. కుమారి 21ఎఫ్ చిత్రాన్ని అలానే నిర్మించాడు. ఉప్పెన చిత్రానికి కూడా సుకుమార్ రైటింగ్స్  కనెక్షన్ ఉంది.

అయితే ఈ బ్యానర్ వ్యవహారాలను ప్రసాద్ అనే వ్యక్తి చూసుకునేవాడు. ఈయన సుకుమార్ కు చాలా దగ్గరి స్నేహితుడు. కాకపోతే ప్రసాద్ కొద్ది రోజుల క్రితం మరణించారు. దీంతో సుకుమార్ రైటింగ్స్ ను చూసుకోవడానికి కొత్త బాస్ కావాలి. ఈ నేపథ్యంలో సుకుమార్ భార్య తబిత సుకుమార్ రైటింగ్స్ వ్యవహారాలు చూసుకోవడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం ఈ బ్యానర్ 18 పేజెస్ చిత్రానికి అసోసియేట్ అయింది. మరోవైపు సుకుమార్ దర్శకుడిగా పుష్ప చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All