
పుష్ప మూవీ తో పాన్ ఇండియా గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్..ప్రస్తుతం పుష్ప 2 మూవీ పనుల్లో బిజీ గా ఉన్నాడు. సుకుమార్ సినిమాల్లోకి రాకముందు లెక్కల మాస్టర్ గా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఈయన కింద ఎంతోమంది శిష్యులు ఎంతో ఉన్నంత స్థాయికి ఎదిగారు. అలాంటి వారిలో సువీక్షిత్ బొజ్జా ఒకరు. దూరదర్శిని చిత్రంలో కథానాయకుడిగా నటించిన సువీక్షిత్ బొజ్జా.. సుకుమార్‌కు వీరాభిమాని. తాజాగా ఈయన తన అభిమానాన్ని చాటుకున్నారు.
సువీక్షిత్ తన సొంతూరు కడప జిల్లా బోరెడ్డిగారి గ్రామంలో రెండున్నర ఎకరాల సొంత భూమిలో వరి పంటతో సుకుమార్ రూపం వచ్చేలా సాగు చేశాడు. దాదాపు 50 రోజులపాటు శ్రమించి ఆ రూపాన్ని తీసుకొచ్చాడు. సుకుమార్ తోపాటు పుష్ప-2 పేరు కూడా సాగు చేయడం మరింత ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను దర్శకుడు సుకుమార్‌కు సువీక్షిత్ చూపించారు. సువీక్షిత్ చూపిన అభిమానానికి దర్శకుడు సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు.
Creative genius Sukumar’s Ekalavya sishya, DOORADARSHINI Hero #Suvixith has farmed paddy in his farmland in Kadapa in the shape of his favorite director @aryasukku . Suvixith has also expressed his love for Pushpa franchise, impressing @AlluArjun's fans too. pic.twitter.com/12a9q7RStq
— BA Raju's Team (@baraju_SuperHit) March 16, 2022