Homeటాప్ స్టోరీస్లెక్క‌ల మాస్టారు కూడా విరాళం ప్ర‌క‌టించారు!

లెక్క‌ల మాస్టారు కూడా విరాళం ప్ర‌క‌టించారు!

లెక్క‌ల మాస్టారు కూడా విరాళం ప్ర‌క‌టించారు!
లెక్క‌ల మాస్టారు కూడా విరాళం ప్ర‌క‌టించారు!

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న కార‌ణంగా దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. దీని కార‌ణంగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. కోవిడ్ – 19 కార‌ణంగా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డైన్ ప్ర‌క‌టించి ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేప్తున్నాయి. క‌రోనా క‌ట్ట‌డికి ఎన్ని దారులున్నాయో అన్నింటిని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ట్ట‌డికి భారీ మొత్తాన్ని కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి.

దీంతో మేము సైతం అంటూ రాజ‌కీయ నాయ‌కులు, కార్పొరేట్ శ‌క్తులు ముందుకొస్తున్నారు. వీరికి ధీటుగా సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఈ యుద్ధంలో మేము సైతం అంటూ ముందుకొస్తున్నాయి. నితిన్ నుంచి మొదలైన విరాళాల ప్ర‌క్రియ‌ కొన‌సాగుతూనే వుంది. ప‌వ‌న్ రెండు, ప్ర‌భాస్ 4 కోట్లు ప్ర‌క‌టించారు. రామ్‌చ‌ర‌ణ్ 70, ఎన్టీఆర్ 75 ప్ర‌క‌టించారు. ఇంకా కొంత నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ప్ర‌క‌టిస్తూనే వున్నారు.

- Advertisement -

తాజాగా సుకుమార్ 10 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ క‌ష్ట‌కాలంలో తాము సైతం అంటూ ముందుకొచ్చారు. ఏపీ 5 ల‌క్ష‌లు, తెలంగాణ‌కు 5 ల‌క్ష‌లు అంద‌జేయున్నారు. ఇక హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అధినేత ఎస్‌. రాధాకృష్ణ మొత్తం ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు 20 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. మైత్రీ మూవీస్ కూడా 20 ల‌క్ష‌లు ప్ర‌క‌టించింది. తెలంగాణ 10, ఏపీ 10 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All