
`సాహో` చిత్రంతో పాన్ ఇండియా స్థాయి దర్శకుల లిస్ట్‌లో చేరిపోయాడు సుజీత్. ఈ మూవీని గ్రాండ్‌గా తీసినా హాలీవుడ్ చిత్రం `లార్గో వించ్` స్ఫూర్తితో తీశారంటూ విమర్శలు వినిపించాయి. సినిమా బాలీవుడ్‌లో ఆకట్టుకున్నా దక్షిణాదిలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. ఫలితం కూడా యావరేజ్‌గా రావడంతో సుజీత్ కి తదుపరి సినిమా ఇప్పట్లో కష్టమనే మాటలు వినిపించాయి.
అయితే ఆ రూమర్‌లకు చెక్ పెడుతూ సుజీత్‌కు `లూసీఫర్` రీమేక్ బాధ్యతల్ని అప్పగించారు రామ్‌చరణ్. ఆ తరువాత స్క్రిప్ట్ కోసం కొన్ని నెలలు వర్క్ చేశారు సుజీత్. అయితే అతని వర్క్ సంతృప్తికరంగా లేకపోవడంతో అతని స్థానంలో వి. వి.వినాయక్‌కు చిరు బాధ్యతలు అప్పగించారనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై చిరు క్లారిటీ ఇచ్చారు.
`లూసీఫర్` రీమేక్ నుంచి సుజీత్‌ని తాము తప్పించలేదని, తానే స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే సుజీత్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత తాను `లూసీఫర్` స్క్రిప్ట్‌పై మనసు పెట్టలేకపోతున్నాని, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటానని సుజీత్ చెప్పాడట. దాంతో తను సరే అన్నారని చిరు చెప్పారు. ఇందులో నిజమెంత అన్నది సుజీత్ చెప్పాల్సిందే.