Homeటాప్ స్టోరీస్సుధా కొంగ‌ర పాన్ ఇండియా మూవీ!

సుధా కొంగ‌ర పాన్ ఇండియా మూవీ!

సుధా కొంగ‌ర పాన్ ఇండియా మూవీ!
సుధా కొంగ‌ర పాన్ ఇండియా మూవీ!

సూర్య హీరోగా న‌టించి నిర్మించిన చిత్రం `ఆకాశం నీ హ‌ద్దురా`. సుధా కొంగ‌ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. `గురు` సినిమాతో తెలుగులో ద‌ర్శ‌కురాలిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఆమె తాజా చిత్రాన్ని భారీ స్థాయిలో తెర‌కెక్కించారు. అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది. ఇటీవ‌ల విడుద‌లైన ఓటీటీ రిలీజ్‌ల‌లో అనూహ్య విజ‌యాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది.

గ‌త కొంత కాలంగా స‌రైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరో సూర్య‌కు ఈ మూవీ రూపంలో బెస్ట్ ఫిల్మ్ ల‌భించింది. ఆయ‌న ఈ మూవీతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేలా చేసింది.  ఈ చిత్రంపై ప్ర‌ముఖుల‌తో పాటు విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియాతో ముచ్చ‌టించిన సుధా కొంగ‌ర ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. ఈ మూవీపై ముందు నుంచి సూర్య గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నార‌ని ఫ‌లితం ఎలా వున్నా తాను పూర్తి స్థాయిలో సంతృప్తి చెందాన‌ని చెప్పార‌ట‌. అంతే కాకుండా ఈ మూవీకి స్ఫూర్తిగా నిలిచిన జీఆర్ గోపీనాథ్ ఒక్క‌సారిగా త‌న పాత జ్ఞాప‌కాల్ని గుర్తు చేశార‌ని అభినందించార‌ట‌. ఇక ఆయ‌న వైఫ్ పాత్ర‌ని పోట్రేట్ చేసిన తీరుకు ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. భార‌తీరాజా ప్ర‌శంస‌ల్ని మ‌ర్చిపోలేన‌ని కూడా చెప్పారామె. త‌న చివ‌రి సినిమాలా పూర్తి ఎఫ‌ర్ట్‌తో ఈ మూవీ తీసిన‌ట్టుగా వుంద‌ని భార‌తీ రాజా ప్ర‌శంసించడం మ‌ర్చిపోలేన‌ని చెబుతున్నారు.

- Advertisement -

ఇక తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన నందిని రెడ్డి, విక్ట‌రీ వెంక‌టేష్ సినిమా చూసి అభినందించార‌ని, సినిమాని ఊహించ‌ని స్థాయిలో తెర‌కెక్కించార‌ని ప్ర‌శంస‌లు కురిపించార‌ట‌. `గురు` త‌రువాత తెలుగు నుంచి చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని అప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ ఫైన‌ల్ కావ‌డంతో తెలుగు ప్రాజెక్ట్‌లు అంగీక‌రించలేద‌ని తెలిపారామె. త‌న నెక్ట్స్ ఫిల్మ్ పాన్ ఇండియా స్థాయిలో వుంటుంద‌ని, దానిక సంబంధించిన మరిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లో తెలియ‌జేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు సుధా కొంగ‌ర‌. ఆయ‌తే అందులో న‌టించే హీరో ఎవ‌రు? .. ఏ సంస్థ నిర్మించ‌నుంది అన్న విష‌యాల్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All