Homeటాప్ స్టోరీస్లాక్‌డౌన్ మాయ‌..పార్క్‌లో స్టార్ హీరో!

లాక్‌డౌన్ మాయ‌..పార్క్‌లో స్టార్ హీరో!

లాక్‌డౌన్ మాయ‌..పార్క్‌లో స్టార్ హీరో!
లాక్‌డౌన్ మాయ‌..పార్క్‌లో స్టార్ హీరో!

క‌రోనా ప్ర‌పంచానికి చాలా నేర్పించింది… ఇప్ప‌టికీ నేర్పిస్తోంది. లాక్‌డౌన్‌, ఐసోలేష‌న్‌, క్వారెంటైన్‌.. ఇంటి ప‌ట్టునే వుండ‌టం. ఖాళీగా వుండ‌టం. కుటుంబంతో గ‌డ‌ప‌డం.. వినూత్నంగా ఆలోచించ‌డం.. బ‌య‌టికి వెళ్ల‌కుండానే షార్ట్ ఫిల్మ్‌లు, సినిమాలు నిర్మించ‌డం.. ప‌బ్లిక్ ప్లేస్‌ల‌కి వెళ్ల‌లేని వారిని ప‌బ్లిక్ ప్లేస్‌ల‌కి వెళ్లేలా చేయ‌డం.. క‌రోనా కార‌ణంగా వీధుల్లో, రోడ్ల‌పై జ‌న స‌మ‌ర్దం బాగా త‌గ్గిపోయింది. దీంతో ఓ స్టార్ హీరో సామాన్యుడిలా బ‌య‌టికి వ‌చ్చి పార్క్ ప‌క్క‌న జాగింగ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

సాధార‌ణ ప‌రిస్థితుల్లో పార్క్‌లో జాగింగ్ చేయ‌డానికి స‌మ‌యం, అవ‌కాశం చిక్క‌ని హీరో హ‌ఠాత్తుగా పార్క్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డం అన్న‌ది లాక్‌డౌన్ చేసిన మాయ అని చెప్ప‌క త‌ప్ప‌దు. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో జ‌నాలంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోవ‌డంతో నిత్యం  వాక‌ర్స్‌తో ర‌ద్ద‌గా వుండే కేబీఆర్ పార్క్ నిర్మానుష్యంగా మారిపోయింది.

- Advertisement -

దీన్ని గ‌మ‌నించిన స్టార్ హీరో అల్లు అర్జున్ ఓ సాధార‌ణ వ్య‌క్తిగా కేబీఆర్ ప‌రిస‌రాల్లో జాగింగ్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. త‌ను జాగింగ్ చేస్తున్న వీడియోని తానే షూట్ చేసుకున్న అల్లు అర్జున్ ఆ వీడియో తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. వైట్ డ్రెస్‌లో మాసిన గ‌డ్డంతో బ‌న్నీ లుక్ చాలా మాసీవ్‌గా క‌నిపిస్తోంది. `పుష్ప‌` కోసం అల్లు అర్జున్ మాస్ గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All