Homeటాప్ స్టోరీస్ఏప్రిల్ 26న భీకర యుద్ధమే

ఏప్రిల్ 26న భీకర యుద్ధమే

star-war-on-april-26thఏప్రిల్ 26న రెండు తెలుగు రాష్ట్రాలలో భీకర యుద్ధం జరగడం ఖాయమై పోయింది ,ఎందుకంటే ఆరోజు మహేష్ బాబు నటించిన ” భరత్ అనే నేను ” అల్లు అర్జున్ నటించిన ” నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ” సినిమాలు విడుదల కానున్నాయి . ఒకేరోజున రెండు భారీ చిత్రాలు విడుదల కావడం వల్ల అభిమానుల మధ్య తీవ్ర పోరాటం జరగడం ఖాయం అలాగే ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్ గా తయారైంది .

దాంతో ఒకరి సినిమా మీద మరొక హీరో అభిమానులు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్న రోజులివి కాబట్టి ఒకేరోజున సినిమాలు రిలీజ్ అవుతున్నందున అల్లు అర్జున్ అభిమానులు , మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తలపడటం ఖాయంగా కనిపిస్తోంది . ఇప్పటికే పోటాపోటీ గా సినిమా రిలీజ్ ల ప్రకటనల నేపథ్యంలో ఒకరంటే ఒకరికి విపరీతమైన కోపం ఏర్పడింది ఇక అప్పటికి ఇది మరింత ముదిరేలా ఉంది . రెండు భారీ చిత్రాలు పోటీ పడితే తప్పకుండా ఆ ప్రభావం కలెక్షన్ల మీద పడుతుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All