Homeటాప్ స్టోరీస్భారీ చిత్రాలను కొనుగోలు చేసిన స్టార్ మా

భారీ చిత్రాలను కొనుగోలు చేసిన స్టార్ మా

భారీ చిత్రాలను కొనుగోలు చేసిన స్టార్ మా
భారీ చిత్రాలను కొనుగోలు చేసిన స్టార్ మా

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో లీడింగ్ ఛానల్ గా స్టార్ మా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం స్టార్ మా సినిమాల కొనుగోలు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ చిత్రాల సాటిలైట్ హక్కులను చేజిక్కించుకుని  మిగిలిన ఛానల్స్ కు అందనంత ఎత్తులో నిలిచింది.

రీసెంట్ గా స్టార్ మా తన లైబ్రరీలో కొత్తగా చేరిన చిత్రాల లిస్ట్ ను అప్డేట్ చేసింది. ఈ క్రమంలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆ లిస్ట్ లో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, మహేష్ బాబు సర్కారు వారి పాట, అల్లు అర్జున్ పుష్ప, బాలకృష్ణ అఖండ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.

- Advertisement -

అంతే కాకుండా నాని టక్ జగదీష్, నాగ చైతన్య లవ్ స్టోరీ, రవితేజ ఖిలాడీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాల సాటిలైట్ హక్కులను కూడా కొనుగోలు చేసింది స్టార్ మా.

డిజిటల్ హక్కుల సంగతెలా ఉన్నా కానీ సాటిలైట్ హక్కుల విషయంలో మాత్రం స్టార్ మా దూకుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది కాకుండా నితిన్ మేస్ట్రో డైరెక్ట్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All