
వెండితెర పై మెస్మరైజ్ చేసే తారల్ని ఫ్యాన్స్ డెమీగాడ్స్ గా చూస్తుంటారు. వారిని ప్రత్యేకంగా చూస్తుంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. అయితే అలాంటి వారి కోసం హీరోలు కూడా తమకు తోచింది, తమ వల్ల అయ్యింది చేస్తూ అభిమానుల్ని ఆనందపరుస్తుంటారు. అయితే హీరో విజయ్ మాత్రం అంతకు మించి చేయడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది.
తమిళనాట హీరో విజయ్‌కి వున్నస్టార్‌డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇళయదళపతిగా పేరు తెచ్చుకున్న విజయ్‌కి రజనీ స్థాయి ఫాన్ ఫాలోయింగ్ వుందన్నది నిర్వివాదాంశం. అతని కోసం ప్రభుత్వాలని ఎదిగించడానికైనా విజయ్ ఫ్యాన్స్ వెనుకాడటం లేదు. ఇదిలా వుంటే ఇటీవలే ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆయన అంత్య క్రియలు చెన్నై శివారులోని ఫామ్ హౌజ్‌లో జరిగాయి. ఈ అంత్యక్రియల్లో చాలా మంది తమిళ నటీనటులు పాల్గొన్నారు. అందులో స్టార్ హీరో విజయ్ కూడా వున్నారు. అత్యంత సాధారణ వ్యక్తిగా విజయ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆయన రాకని గమనించిన అబిమానులు పెద్ద సంక్షలో గుమిగూడే సరికి తోపులాట జరిగింది.
దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఎక్కడి వాళ్లు అక్కడ అన్నట్టు చెల్లచెదురయ్యారు. కొంత మంది చెప్పులు వదిలేసి పరుగులు తీశారు. ఓ అభిమాని చెప్పుని కోల్పోయాడు. అది విజయ్ కంటపడింది. వెంటనే ఆ చెప్పుని తీసి సదరు అభిమానికి అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.