Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్స్టార్ క‌మెడియ‌న్ ఆలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌!

స్టార్ క‌మెడియ‌న్ ఆలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌!

 స్టార్ క‌మెడియ‌న్ ఆలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌!
స్టార్ క‌మెడియ‌న్ ఆలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌!

హాస్య న‌టుడిగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి అత్య‌ధిక చిత్రాల్లో న‌టించిన న‌టుడిగా స్టార్ క‌మెడియ‌న్ అలీకి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి పేరుంది. ప్ర‌స్తుతం వ‌రుస‌ క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్న ఆయ‌న తాజాగా నిర్మాణ రంగంలోకి ఎంట‌ర‌వుతున్నారు. గ‌త కొంత కాలంగా ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ పార్టీకి అత్యంత స‌న్నిహితంగా వుంటున్న ఆయ‌న ఏపీ ఎన్నిక‌ల వేళ వైఎస్సార్సీపీ పార్టీ అధినేత‌, ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో పార్టీలో చేరి క్రియాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. అప్ప‌టి నుంచి నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు.

- Advertisement -

తాజాగా ఆయ‌న మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. 1987 నుంచి ఆర్టిస్ట్‌గా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వున్నా ఇంత వ‌ర‌కు అలీ సొంత నిర్మాణ సంస్థ‌ని స్థాపించ‌లేదు. ఇండ‌స్ట్రీలో వున్న హీరోలు, ద‌ర్శ‌కులు, హీరోయిన్‌లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు సొంత నిర్మాణ సంస్థ‌ల్ని స్థాపించి నిర్మాత‌లుగా మారినా అలీ మాత్రం ఆ సాహ‌సం చేయ‌లేదు. తాజాగా ఆయ‌న త‌న పేరు మీదే `అలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌` పేరుతో సొంత నిర్మాణ సంస్థ‌ని స్థాపిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌. క‌న్న‌డ‌. హిందీ భాషల్లో ఈ సంస్థ ద్వారా సినిమాలు, సీరియ‌ల్స్‌, వెబ్ సిరీస్‌ల‌ని నిర్మించ‌బోతున్నారు.

అలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ లోగోని ద‌ర్శ‌కుడు ఎస్వీకృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి సంయుక్తంగా రిలీజ్ చేశారు. రాబోయే కాలంలో వెబ్ సిరీస్‌ల నిర్మాణం ఊపందుకోబోతోంది. దానికి సంబంధించిన సేవ‌ల్పి త‌మ అలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ అందిస్తుంద‌ని, త‌న సంస్థ ద్వారా త్వ‌ర‌లో వెబ్‌సిరీస్‌, టీవీ షోల‌ని ప్రారంభించ‌బోతున్నాన‌ని ఈ సంద‌ర్భంగా ఆలీ వెల్ల‌డించారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts