
ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే ఏ సంగీత దర్శకుడికి లేనంత హవా ఎస్ ఎస్ థమన్ కు ఉంది. టాలీవుడ్ లో చేతినిండా కాదు, అంతకు మించి సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉన్నాడు. ఒక సినిమా పూర్తి చేసే లోపు థమన్ చెంతకు రెండు సినిమాలు వస్తున్నాయి. అలా అని థమన్ ఔట్పుట్ ఏం తగ్గట్లేదు. రఫ్ఫాడించే మ్యూజిక్ ను ఇస్తున్నాడు.
థమన్ కు పవన్ కళ్యాణ్ తో, చిరంజీవితో, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో.. ఇలా కొంత మంది ప్రముఖులతో పనిచేయాలన్న కోరిక ఉండేది. చాలా కాలానికి ఈ కోరికలు తీరాయి. ఇక తన గురువు శంకర్ తో కూడా థమన్ పనిచేయబోతున్నాడు. ఇలా థమన్ సూపర్ ఫామ్ లో దూసుకుపోతుండగా మరో భారీ ప్రాజెక్ట్ లో కూడా థమన్ భాగం కానున్నాడట.
విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం విజయ్ కోలీవుడ్ లో నెం 1 హీరో. ఇప్పుడు విజయ్ సినిమాకు సంగీతం అందించడం అంటే కోలీవుడ్ లో కూడా థమన్ టాప్ ప్లేస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.