
ప్రస్తుతం స్టార్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఫామ్ మాములుగా లేదు. వరసగా స్టార్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవుతుండడంతో థమన్ కు ఎదురే లేకుండా పోతోంది. చాలా కాలం తర్వాత వరసగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాలు చేయనున్నాడు థమన్.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సర్కారు వారి పాట చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది కూడా. ఈ నేపథ్యంలో థమన్ ఈ చిత్రం గురించి ఆసక్తికర అంశాలను రివీల్ చేసాడు. సర్కారు వారి పాట ఒక పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పేసాడు.
అలాగే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, మహేష్ అభిమానులు కచ్చితంగా ఈ సినిమా చూసి గర్వంగా ఫీల్ అవుతారని అంటున్నాడు. ఇక త్రివిక్రమ్ – మహేష్ సినిమా గురించి కూడా కొంచెం క్లారిటీ ఇచ్చాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో బెస్ట్ ఔట్పుట్ ఇది అవుతుందని చాలా నమ్మకంగా చెబుతున్నాడు.