
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తోన్న పుష్ప పార్ట్ 1 పూర్తయ్యాక కొంచెం గ్యాప్ తీసుకుని ఎప్పటినుండో పెండింగ్ లో పెట్టిన ఐకాన్ ను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నుండి మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్నాడు. వకీల్ సాబ్ చిత్రంతో వేణు శ్రీరామ్ తన వర్త్ ను ప్రూవ్ చేసుకున్నాడు.
స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి రావడంతో వేణు శ్రీరామ్ తన టీమ్ ను ఎన్నుకునే పనిలో పడ్డాడు. అందరూ ఈ చిత్రానికి థమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకుంటారని అనుకుంటున్నారు. ఎందుకంటే వకీల్ సాబ్ విజయంలో థమన్ పాత్ర వెలకట్టలేనిది. అయితే వేణు శ్రీరామ్ మాత్రం మరో సంగీత దర్శకుడితో ముందుకెళ్లాలని అనుకుంటున్నాడట.
ఇప్పటిదాకా తను చేసిన మూడు సినిమాలకు ముగ్గురు సంగీత దర్శకులు వర్క్ చేశారు. దీంతో ఐకాన్ కు అనిరుధ్ లేదా బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ ను తీసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు దిల్ రాజు అండ్ క్యాంప్ థమన్ కు ఓటు వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.