ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఒక్క ఫైట్ కోసం 45 కోట్ల ఖర్చు చేయనున్నారట . ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి కారణం ఏంటో తెలుసా …… అది ఇంటర్వెల్ బ్యాంగ్ కావడమే ! రాజమౌళి చిత్రాల్లో ఇంటర్వెల్ అసాధారణస్థాయిలో ఉంటుందన్న విషయం తెలిసిందే . ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం రెండు నెలల పాటు 2000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లతో భారీ ఎత్తున చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట .
రెండు నెలల పాటు అందునా 2000 మందికి పైగా జనాలు కావడంతో ఆ లొకేషన్ లో కావాల్సిన ప్రతీ వస్తువుని జాగ్రత్తగా ఇప్పుడే సెట్ చేసుకోవాలని అందుకోసం 45 కోట్లు ఖర్చు పెట్టాలని డిసైడ్ చేసాడట జక్కన్న . సినిమాలో ఈ ఎపిసోడ్ కోసమే మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న . ఇక ఎన్టీఆర్ , రాంచరణ్ ఫ్యాన్స్ అయితే జక్కన్న కు ఫిదా అవ్వడం ఖాయమట ! ఆ స్థాయిలో ఇద్దరి హీరోయిజం చూపించేలా ప్లాన్ చేసాడట అందుకే ఈ ఎపిసోడ్ కోసం అంత భారీగా ఖర్చు పెట్టాలని షెడ్యూల్ షీట్ ఇచ్చేశాడట జక్కన్న .