Homeటాప్ స్టోరీస్అరవింద సమేత పై జక్కన్న కామెంట్

అరవింద సమేత పై జక్కన్న కామెంట్

SS rajamouli comments on NTR's Aravinda sametha యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని ఎట్టకేలకు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చూసాడు. ఎన్టీఆర్ సినిమాని చూసి జక్కన్న ఏం కామెంట్ చేసాడో తెలుసా…… ఎన్టీఆర్ ని ఎలా పొగిడాడో తెలుసా….. త్రివిక్రమ్ ని ఏమన్నాడో తెలుసా…… ఏమంటాడు …… పొగడ్తలే పొగడ్తలు . ఎన్టీఆర్ మీద త్రివిక్రమ్ మీద అరవింద సమేత వీర రాఘవ చిత్రం మీద ప్రశంసల వర్షం కురిపించాడు జక్కన్న. యుద్ధం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్నది త్రివిక్రమ్ చాలా చక్కగా చూపించాడని , త్రివిక్రమ్ చేసిన సాహసం ఇదని అలాగే అరవింద సమేత లో ఎన్టీఆర్ అభినయం అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు రాజమౌళి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు అఖండ విజయాన్ని అందిస్తున్నారు.

దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలైన అరవింద సమేత చిత్రం మొదటి రోజు నుండే వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 33 కోట్ల షేర్ రాబట్టాడు ఎన్టీఆర్ . ఇక రాజమౌళి ఎన్టీఆర్ కు చాలా దగ్గరి వ్యక్తి పైగా ఆత్మ బంధు లాంటి వాడు కావడంతో ఎన్టీఆర్ ప్రతీ సినిమాని చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు . తాజాగా అరవింద చిత్రాన్ని చూసి ఎన్టీఆర్ తో పాటుగా త్రివిక్రమ్ పై కూడా ప్రశంసలు కురిపించాడు జక్కన్న. పనిలో పనిగా విలన్ గా నటించిన జగపతిబాబుని కూడా మెచ్చుకున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా తమన్ సంగీతం అందించాడు. రాధాకృష్ణ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు.

- Advertisement -

English Title: SS rajamouli comments on NTR’s Aravinda sametha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All