Homeటాప్ స్టోరీస్ఈ సినిమాకి వచ్చిన కష్టం పగ వారికి కూడా రాకూడదు...

ఈ సినిమాకి వచ్చిన కష్టం పగ వారికి కూడా రాకూడదు…

ఈ సినిమాకి వచ్చిన కష్టం పగ వారికి కూడా రాకూడదు...
ఈ సినిమాకి వచ్చిన కష్టం పగ వారికి కూడా రాకూడదు…

‘బాహుబలి ది బిగినింగ్’, ‘బాహుబలి ది కంక్లూషన్’ సినిమాల ద్వార తెలుగు సినిమాలని ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తిన ‘ఎస్.ఎస్.రాజమౌళి’ గారికి ఇంకొక ఘనత దక్కింది.
లండన్ లోని సుప్రసిద్ధ రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా టీమ్ వారు బాహుబలి సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను లైవ్ ఆర్కెస్ట్రాతో వినిపించారు. అక్టోబర్ 19న జరిగిన ఈ కార్యక్రమానికి రాజమౌళితో సహా కీరవాణి అండ్ టీమ్ అలాగే ప్రభాస్, రానా, అనుష్క శెట్టి హాజరు అయ్యారు.

అయితే ఇందులో ఇంకొక సమస్య ఎదురైంది. బాహుబలి ది కంక్లూషన్ సినిమా తర్వాత గత సంవత్సరం ”ఆర్.ఆర్.ఆర్” సినిమాని మొదలు పెట్టారు జక్కన్న. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకి అనుకోకుండా సినిమా షూటింగ్ సమయంలో హీరోలు అయిన యంగ్ టైగర్ ‘జూ:ఎన్.టి.ఆర్‘ అలాగే మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ గారికి ఒకరికి తర్వాత ఒకరికి గాయాలు అయ్యాయి. ఇద్దరికీ గాయాలు తగ్గి కొంత సమయం తీసుకున్న తర్వాత సినిమా షూటింగ్ తిరిగి మొదలు అయ్యింది.

- Advertisement -

జూ:ఎన్.టి.ఆర్ సన్నివేశాలని షూట్ చేసి, రామ్ చరణ్ సన్నివేశాలని కూడా తీసేవారు రాజమౌళి గారు. ఇద్దరికీ ఒకే రోజు షూటింగ్ ఉంటే ముందే ప్రణాళికలు సిద్ధం చేసేవారు. విజయవంతంగా జూ:ఎన్.టి.ఆర్ సన్నివేశాలని షూటింగ్ చేసిన రాజమౌళి గారు రామ్ చరణ్ విషయం దగ్గరికి వచ్చే సరికి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాకి నిర్మాత రామ్ చరణ్ కనుక అటు సినిమా ప్రెస్ మీట్ లో నాన్న చిరంజీవికి తోడుగా ఉండటం వలన రామ్ చరణ్ సన్నివేశాలు ఆగిపోయాయి.

ఇక సైరా సినిమా విడుదల అయ్యింది సినిమాకి అడ్డంకులు ఏమి లేవు అనుకున్న తరుణంలో రాజమౌళి గారు బాహుబలి సినిమా విషయంలో లండన్ కి వెళ్లి వారం లేదా 10 రోజులు విరామం తీసుకున్నారు. ఒకరి వలన సమయం వృధా అవుతుంది అనుకుంటే ఇప్పుడు ముగ్గురు సినిమాకి అడ్డంకులుగా మారి సినిమాని జనాలకి లేటుగా విడుదల చేస్తారు అని భయపడుతున్నారు. అసలే రాజమౌళి గారి సినిమాలు సంవత్సరాల పాటుగా షూటింగ్ జరుపుకుంటాయి. అందులో ఇలాంటి విషయాల వలన సినిమా ఇంకా లేట్ అయ్యి సారీ మీట్ పెట్టి మళ్ళీ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి ఇంకొక డేట్ ప్రకటించిన అందులో డౌట్ లేదు.

ఇప్పటికి కొంతమంది రాజమౌళి సన్నిహితులో ఒకలు ఆర్.ఆర్.ఆర్ సినిమా జులై 30 న విడుదల కాకపోవచ్చు. దసరాకి కచ్చితంగా విడుదల చెయ్యాలి అనుకుంటున్నారు అని ఒక వార్త బయటికి వచ్చింది. అందులో నిజం ఉందొ ఏదో అని ఆలోచించడం కంటే జరుగుతున్న పరిణామాలు చూసి లేట్ అయినా సినిమా లేటుగా విడుదల అవ్వడంలో తప్పు లేదు…. ఈ సినిమాకి వచ్చిన కష్టం పగ వాడికి కూడా రాకూడదు అని అనుకుంటున్నారు జనాలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All