
మైఖేల్ క్రోసల్‌తో డేటింగ్ ఆ తరువాత ప్రేమాయణంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వరుస వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో కెరీర్‌ని లైట్ తీసుకుంది. సినిమాలకు దూరంగా వుంది. అయితే ఆ తరువాత మైఖేల్ క్రోసల్‌కి బ్రేకప్ చెప్పేసింది. సింగింగ్ కాన్సర్ట్‌లతో బిజీ బిజీగా గడపడం మొదలుపెట్టింది. మళ్లీ స్పీడు పెంచి సినిమాల్లో యాక్టివ్‌గా వుంటోంది.
త రెండేళ్లుగా సినిమాలకు దూరంగా వుంటూ వచ్చిన శృతిహాసన్ తాజాగా నటన, సింగింగ్‌లపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో `కాటమరాయుడు` తరువాత మరో చిత్రాన్ని చేయని శృతిహాసన్ `క్రాక్` చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ముంబై నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చేసిన శృతిహాసన్ ఇటీవల నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న నెట్ ఫ్లిక్స్ సిరీస్‌లో నటిస్తోంది.
అక్టోబర్‌లో శృతిహాసన్ రెండు చిత్రాల్లో నటించబోతోంది. రవితేజ `క్రాక్` చిత్రంతో పాటు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న `వకీల్ సాబ్` చిత్రంలోనూ నటించనుందట. ఈ రెండు చిత్రాలకు సంబందించిన బ్యాలెన్స్ షూటింగ్‌లో శృతిహాసన్ కనిపించనుందట. ఈ టూ మూవీస్‌తో శృతి తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలనే ప్రయత్నాల్లో వున్నట్టు తెలుస్తోంది.