
దాదాపు మూడేళ్ల విరామం తరువాత మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. శృతి రీఎంట్రీ ఇచ్చిన మూవీ `క్రాక్`. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి శృతి కెరీర్‌కి మరింత బూస్టప్ ఇచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న శృతిహాసన్ ఈ మూవీ తరువాత బంపర్ ఆఫర్‌ని దక్కించుకున్న విషయం తెలిసిందే.
`క్రాక్` హిట్ తరువాత శృతిహాసన్ నటిస్తున్న చిత్రం `సలార్`. ప్రభాస్ హీరోగా `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. మైనింగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
అయితే ఈ మూవీలో వృథిహాసన్ టీవీ జర్నలిస్టుగా కనిపించనుందని తెలిసింది. ఇప్పటికే `సలార్` షూట్‌లో ఎంటరైన శృతిహాసన్ రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసిందట. భారీ అంచనాల మధ్య హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.