Homeటాప్ స్టోరీస్హీరో అర్జున్ పై లైంగిక ఆరోపణలు

హీరో అర్జున్ పై లైంగిక ఆరోపణలు

హీరో అర్జున్ పై లైంగిక ఆరోపణలు
హీరో అర్జున్ పై లైంగిక ఆరోపణలు

తెలుగు , తమిళ బాషలలో స్టార్ హీరోగా వెలుగొందిన హీరో అర్జున్ పై సంచలన ఆరోపణలు చేసింది హీరోయిన్ శృతి హరిహరన్ . రెండేళ్ళ క్రితం ఓ సినిమాలో అర్జున్ సరసన నటించాను . అర్జున్ కు భార్యగా నటించాను కాగా ఒక సన్నివేశంలో దర్శకుడు చెప్పకుండానే స్క్రిప్ట్ లో లేని విధంగా నన్ను గట్టిగా కౌగిలించుకొని , పిరుదుల మీద గట్టిగా చేయి వేసి నొక్కడాని దానికి నేను షాక్ అయ్యానని అలాగే దర్శకుడు కూడా షాక్ అయ్యాడని కానీ అప్పట్లో ఈ విషయం గురించి బయట చెప్పడానికి ధైర్యం చేయలేదని ఎందుకంటే అర్జున్ కు ఉన్న పలుకుబడి వల్లే ! అంటూ అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసి అతడ్ని ఇరుకున పెట్టింది శృతి హరిహరన్ . సీన్ లో లేని విధంగా హీరోయిన్ ని దగ్గరకు లాక్కొని వేయకూడని చోట చేతులు వేసి తడుముతుంటే అది హీరోఇజమా ?

మీటూ ఉద్యమం భారత్ లో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది , ఇప్పటికే ఓ కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ మీటూ ఉద్యమం వల్ల . ఇక పలువురు హీరోయిన్ లు ముందుకు వచ్చి తమకు జరిగిన అవమానాలను చెబుతున్నారు . ఇక ఇప్పుడేమో శృతి హరిహరన్ అర్జున్ పై ఆరోపణలు చేసింది . మరి అర్జున్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All