Homeటాప్ స్టోరీస్అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో `గాలి సంప‌త్‌`షురూ!

అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో `గాలి సంప‌త్‌`షురూ!

 Srivishnu`s Gali sampath movie launched

Srivishnu`s Gali sampath movie launched

బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో `గాలి సంప‌త్‌` ప్రారంభ‌మైంది. శ్రీ‌విష్ణు హీరోగా న‌టిస్తున్నారు. ల‌వ్‌లీ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి అనీష్‌కృష్ణ ద‌ర్శ‌కుడు. ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కు అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రాలకు కో-డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన ఎస్‌. కృష్ణ ఈ చిత్రం ద్వారా నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. అనిల్ రావిపూడి స‌మ‌ర్పించ‌డ‌మే కాకుండా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

ఇమేజ్ స్పార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్ బేన‌ర్స్ పై ఈ చిత్రం రూపొందుతోంది. డా.రాజేంద్ర‌‌ప్ర‌సాద్ `గాలి సంప‌త్‌`గా టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి దిల్‌రాజు క్లాప్ నివ్వ‌గా, హీరో నారా రోహిత్ కెమెరా స్విఛాన్ చేశారు. హీరో వ‌రుణ్‌తేజ్ గౌర‌‌‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సాయి శ్రీ‌రామ్ కెమెరా, మిర్చి కిర‌ణ్ డైలాగ్స్ అందిస్తున్నారు.

- Advertisement -

ఈ నెల 18 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తండ్రీకొడుకుల మ‌ధ్య సాగే ఓ విభిన్న‌మైన క‌థ‌గా ఈ చిత్రం రూపొంద‌నుంది. టైటిల్ పాత్ర‌లో డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టిస్తున్నార‌ని, ఆయ‌న కెరీర్‌లో ఈ మూవీ మ‌రో మైల్‌స్టోన్‌గా నిలుస్తుంద‌ని అనిల్ రావిపూడి తెలిపారు. `గాలి సంప‌త్‌` ఓ అద్భుత‌మైన ట్రీట్ లాంటి సినిమా. అచ్చ తెలుగు క‌థ ఇది. ఇందులో నాకు ఫాద‌ర్‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు న‌టించ‌డం నా అదృష్టం`అని శ్రీ‌విష్ణు తెలిపారు. త‌నికెళ్ల‌భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్, సురేంద్ర‌రెడ్డి, గ‌గ‌న్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All