Homeటాప్ స్టోరీస్రాపిడ్ స్పీడుతో షాకిస్తున్న `గాలి సంప‌త్‌`‌!

రాపిడ్ స్పీడుతో షాకిస్తున్న `గాలి సంప‌త్‌`‌!

రాపిడ్ స్పీడుతో షాకిస్తున్న `గాలి సంప‌త్‌`‌!
రాపిడ్ స్పీడుతో షాకిస్తున్న `గాలి సంప‌త్‌`‌!

స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో స్క్రీన్‌ప్లే అందిస్తున్న చిత్రం `గాలి సంప‌త్‌`. అనిల్ రావిపూడి వ‌ద్ద కో డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా ప‌నిచేసిన ఎస్‌. కృష్ణ ఈ మూవీ ద్వారా నిర్మాత‌గా మారుతున్నారు. శ్రీ‌విష్ణు, ల‌వ్‌లీ సింగ్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌ని డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ పోషిస్తున్నారు. అనీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌ల అర‌కులో ప్రారంభ‌మైంది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే సుడిగాలి వేగంతో ఈ మూవీ షూటింగ్‌ని ఇప్ప‌టి వ‌ర‌కు 80 శాతం పూర్తి చేసి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది చిత్ర బృందం. జ‌న‌వ‌రి 18 నుంచి ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కాబోతోంది.

- Advertisement -

తండ్రీ కొడ‌కుల మ‌ధ్య వున్న అనుబంధం నేప‌థ్యంలో స‌రికొత్త క‌థా క‌థ‌నాల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తండ్రీ కొడుకుల ఎమోష‌న్ కి అనిల్ రావిపూడి మార్కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని జోడించి ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రాన్ని అనిష్ తెర‌కెక్కిస్తున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర‌రెడ్డి, గ‌గ‌న్, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ల్యాణి, సాయి శ్రీ‌నివాస్, రూపా ల‌క్ష్మి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All