
గీత గోవిందం మూవీ తో తెలుగు లో బ్లాక్ బస్టర్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక..మొదటి మూవీ తోనే యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. ఆ తర్వాత అమ్మడు చేసిన సినిమాలు భారీ విజయాలు దక్కడం , పెద్ద హీరోలు సైతం ఈమెనే కావాలని పట్టుపట్టడంతో అమ్మడి క్రేజ్ విపరీతంగా పెరిగింది. రీసెంట్ గా పుష్ప మూవీ లో శ్రీవల్లి గా అందంతో పాటు నటన తో ఆకట్టుకోవడం తో అమ్మడికి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ మరింత పెరిగింది.
ప్రస్తుతం శర్వానంద్ సరసన ఆడాళ్లు మీకు జోహార్లు మూవీ చేసింది. ఫిబ్రవరి 25 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు పుష్ప 2 షూటింగ్ త్వరలో జాయిన్ కాబోతుంది. ఇలా తెలుగు లోనే కాదు తమిళ్ , హిందీ లోను పలు సినిమాలు చేస్తుంది. షూటింగ్ లతో ఎంత బిజీ గా ఉన్న సరే..జిమ్ లో మాత్రం వర్క్ ఔట్స్ చేయకుండా ఉండదు.
ప్రతి రోజు కనీసం గంట అయినా సరే జిమ్ చేసి..తన ఫిజిక్ ను అధీనంలో ఉంచుకునేందుకు చూసుకుంటుంది. తాజాగా ఈమె జిమ్ లో ఎంత కష్టపడుతుందో..దాని తాలూకా వీడియో బయటకు వచ్చింది. ఆమె కష్టాన్ని చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ రేంజ్ లో క్షటపడడం చూడలేకపోతున్నామని కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram