
లండన్‌కు చెందిన నటుడు మైఖేల్ క్రోసల్‌తో గత కొంత కాలంగా డేటింగ్ చేసిన శృతి హాసన్ నిత్యం అతనితో కలిసి ఫొటోలకు పోజులిస్తూ ఆ మధ్య వార్తల్లో నిలిచింది. సినిమాలకు గుడ్ బై చెప్పేసి మైఖేల్‌తో సెటిలైపోతుందేమో అని అంతా భావించారు. ఇంతలోనే అతనికి బ్రేకప్ చెప్పేసిన శృతిహాసన్ కొంత విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.
విజయ్ సేతుపతి నటిస్తూ నిర్మిస్తున్న `లాభం` సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తెలులో కూడా స్పీడు పెంచేసింది. మాస్ మహారాజాతో కలిసి `క్రాక్` చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ విరామంలో పల్సర్‌పై స్వారీ చేసి హల్ చల్ చేసిన శృతి తాజాగా బ్లాక్ లెదర్ బ్రా ధరించి ఇంటర్నెట్‌ని హీటెక్కించేస్తోంది. ఇన్ స్టాలో శృతి హొయలు పోతూ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా మారిన ఈ సోయగం తాజాగా బ్లాక్ లెదర్ బ్రా.. ఆపై డెనిమ్ బ్లాక్ జాకెట్ ధరించి సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. నెట్టింట్లో నెటిజన్స్‌తో పాటు అభిమానుల్ని ఈ ఫొటోలు హీటెక్కిస్తున్నాయి. శృతి స్టన్నింగ్ లుక్ వైరల్ అవుతోంది.