Homeటాప్ స్టోరీస్ఫ్లాప్స్ వచ్చినా ప్రయత్నాలు మాత్రం తగ్గట్లేదు

ఫ్లాప్స్ వచ్చినా ప్రయత్నాలు మాత్రం తగ్గట్లేదు

Srinuvaitla Next movie with Srinivas Bellamkonda
Srinuvaitla Next movie with Srinivas Bellamkonda

దర్శకుడు ‘శ్రీనువైట్ల‘ మార్క్ కామెడీ-యాక్షన్ ని ఇప్పటికి ఇష్టపడేవారుంటారు. ‘సొంతం’ సినిమా దగ్గరనుండి ‘దూకుడు’ సినిమా వరకు ప్రతి సినిమాలో తన మార్క్ కనిపిస్తుంది. దూకుడు తర్వాత ‘బాద్ షా’ హిట్ అయినప్పటికీ  జూ. ఎన్.టి.ఆర్  అభిమానుల వరకు మాత్రమే ఆ సినిమా హిట్ గా నిలిచింది. మిగిలిన వారికి దూకుడు 2 గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

తర్వాత 4 సినిమాలకి దర్శకత్వం చేసాడు శ్రీనువైట్ల. 4 సినిమాలలోని కథానాయకులకు అవి కెరీర్ వరస్ట్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అంటే శ్రీను వైట్ల శైలి మార్చుకోవడానికి ఇవి మంచి ఉదాహరణగా నిలిచాయి. గత సంవత్సరం రవితేజకి నిజంగానే హిట్ ఇస్తాడు అని అనుకున్నారు. అలా అనుకొని ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ సినిమాకి వెళ్లిన జనాల పరిస్థితి  గోరంగా తయారయ్యింది, శ్రీను వైట్లకి కూడా రవితేజ ఫ్యాన్స్ బాగా వార్నింగ్ ఇచ్చారు. 3 హిట్స్  తర్వాత 4 వ కాంబినేషన్ కి మంచి పేరుంది బయట.తీరా చూస్తే ఆ సినిమా రవితేజ కెరీర్ లో భారీ డిసాస్టర్ కాగా, సినిమా 10 కోట్లు కూడా కలెక్షన్ రాబట్టలేకపోయింది.

- Advertisement -

అయితే ఇప్పుడు శ్రీనువైట్ల గారు ‘బెల్లంకొండ శ్రీనివాస్‘ కి కథ చెప్పి ఒప్పించారంటా. శ్రీనివాస్ కి కూడా కథ బాగా నచ్చి చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారంటా. అయితే నిర్మాతల కోసం  శ్రీనువైట్ల గారు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇది తెలిసిన నిర్మాత  ‘బెల్లంకొండ సురేష్’  తనయుడి కోసం శ్రీనువైట్ల కి నిర్మాతలని వెతికి చూస్తా అని చెప్పారు.

అసలే రాక రాక హిట్ వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ ఉన్నట్టుండి శ్రీనువైట్ల చేతిలో పెట్టడం చూసి బెల్లంకొండ ఫ్యామిలీ పెద్ద సాహసమే చేస్తున్నారు అని అనుకుంటున్నారు సినిమా వర్గాలు. ఈ ఏడాది శ్రీనివాస్ ‘సీత’, ‘రాక్షసుడు’ సినిమాలు చెయ్యగా, సీత ఫ్లాప్ అయ్యింది. రాక్షసుడు సినిమా శ్రీనివాస్ కి మొదటి సూపర్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాలో నటన పరంగా ఎక్కువ మార్కులు వేయించుకున్నాడు.

మరి అలాంటి మంచి కెరీర్ బెస్ట్ ఇచ్చిన నీకు శ్రీనువైట్ల గారు ఫ్లాప్ ఇస్తే ఇంకా నువ్వు కూడా ఇంకొక హిట్ కోసం వేరే దర్శకుల దగ్గరికి పోయి ఛాన్సెస్ అడగాలి అంటున్నారు బెల్లంకొండ ఫ్యాన్స్.  చూద్దాం మరి ఈ సారి అయినా శ్రీనువైట్ల గారు మంచి హిట్ ఇస్తారో లేదో? ‘వి అర్ వెయిటింగ్ ఫర్ యువర్ బెస్ట్ మూవీ’ అని శ్రీనువైట్లకి మద్దతుగా ఫ్యాన్స్ ట్విట్టర్ లో అల్ ది బెస్ట్ చెపుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All