
సినీ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ..నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా పరిచమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ కుర్ర హీరో..తాజాగా పెళ్లి సందD సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకులను పెద్దగా ఆకట్టుకోనప్పటికీ , బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.
ప్రస్తుతం వైజయంతి మూవీస్ బ్యానర్ లో మూడో సినిమా చేయబోతున్నాడు. ఈ తరుణంలో ఈ యంగ్ హీరో తన పేరులోని స్పెల్లింగ్‌ను “Roshann” గా మార్చుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం తన పేరుకు అదనంగా ‘n’ని జోడించాడు. మరి ఈ లెటర్ రోషన్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. గతంలో పలువురు హీరోలు సైతం తమ పేర్లలో పలు లెటర్స్ యాడ్ చేసుకోవడం జరిగింది.