
హీరో శ్రీకాంత్ – దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కంబినేషన్‌లో వచ్చిన మ్యూజికల్ ఎంటర్‌టైనర్ `పెళ్లిసందడి`. రవళి, దీప్తీ భట్నాగర్ హీరోయిన్‌లుగా సి.అశ్వనీదత్, అల్లు అరవింద్ సంయుక్తంగా కలిసి నిర్మించిన ఈ చిత్రం హీరో శ్రీకాంత్ కెరీర్‌నే ఓ మలుపు తిప్పింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ని త్వరలో తెరపైకి తీసుకురానున్న విషయం తెలిసిందే.
1996లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా `పెళ్లిసందD` పేరుతో తెరకెక్కించబోతున్నారు. ఇందుఏలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనన్‌కి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీలో హీరో శ్రీకాంత్ కూడా కనిపించనున్నారట. కథను మలుపు తిప్పే పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తారని, ఆయన పాత్ర చాలా తక్కువ సమయమే వుంటుందని కానీ కథకు చాలా కీలకమని చెబుతున్నారు. జనవరి నుంచి సెట్స్‌పైకి రానున్న ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ నటించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.