
గత వారం 13 న రిలీజ్ అయిన సినిమాలు ఎన్ని అని అడిగితే? ఎవరైనా ఏం చెప్తారు? “నాని’స్ గ్యాంగ్ లీడర్” అని ఠక్కున చెప్తారు, అది ఒక్క సినిమా రిలీజ్ అయిన బాగుండును, దాని గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళము. ఎందుకంటే మన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గారు నటించిన సినిమా “మార్షల్” కూడా రిలీజ్ అయింది.
ఆ సినిమా ప్రమోషన్స్ దగ్గరనుండి థియేటర్ దగ్గర వచ్చేవరకు మంచిగా పబ్లిసిటీ చేసిన కుడా, థియేటర్ నుండి టాక్ కూడా వచ్చింది లేదు, ఈ రోజు చూస్కుంటే ఈ సినిమా మొత్తం ఇప్పటికి 30 థియేటర్ లో కూడా లేదు. మరి సినిమా గురించి మాట్లాడటం ఆపేసారా? లేక చూసిన వాళ్ళు బాగులేదని పక్కకి పెట్టేసారా అన్న ప్రశ్న భగవంతునికే వదిలెయ్యాలి.
హీరో,ప్రొడ్యూసర్ కొత్తవాడు అవ్వడం వల్లనే ఇలా జరిగింది అని అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా ట్రైలర్ అండ్ వ్యూస్ బాగానే వచ్చాయి, మరి ఏం జరిగిందో ఏమో?
ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే సినిమాల రివ్యూస్ విషయంలో నేనెప్పుడు ఆలోచించలేదు, అంత టైం కూడా లేదు అని పలుసార్లు మాట్లాడాడు మీడియా ముందు. అలాగే రీసెంట్ గా తన తదుపరి వెబ్ సిరీస్ గురించి చెప్పుతూ పేరు “చదరంగం” అని పోస్ట్ షేర్ చేసాడు.
Twitter:
On the sets of my first webseries #Chadarangam with talented director #Raja produced by @24framesfactory#ChadarangamOnZee5 @ZEE5Telugu @ZEE5Premium #ZEE5Originals pic.twitter.com/uB2px4irCg— SRIKANTH MEKA (@actorsrikanth) September 17, 2019
Credit: Twitter