
ఫేమ్ తగ్గిన హీరోలని విలన్‌లుగా మార్చడం యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుకి సెంటిమెంట్‌గా మారినట్టుంది. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబుని `లెజెండ్` మూవీతో విలన్‌గా పరిచయం చేసిన విషయం తెలిసిందే. బన్నీ నటించిన `సరైనోడు` చిత్రం కోసం యంగ్ హీరో ఆది పినిశెట్టిని వైరమ్ ధనుష్ అంటూ విలన్‌గా తెరపైకి తీసుకొచ్చారు.
బోయపాటి విలన్‌గా ట్రాక్ మార్చిన జగపతిబాబు ఇప్పటికే అదే ఫార్ములాని ఫాలో అవుతూ యమ బిజీ అయిపోయారు. ఆది హీరోగా, విలన్ గా కంటిన్యూ అవుతున్నాడు. తాజాగా బోయపాటి కన్ను హీరో శ్రీకాంత్ మీద పడింది. `సరైనోడు` చిత్రంలో అల్లు అర్జున్‌కు బాబాయ్‌గా పాజిటివ్ పాత్రలో చూపించిన బోయపాటి శ్రీను తన తాజా చిత్రం కోసం హీరో శ్రీకాంత్‌ని విలన్‌ని చేస్తున్నాడు.
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే రీ స్టార్ట్ అయింది. ఇందులో బాలయ్య డ్యుయల్ రోల్‌లో కనిపించబోతున్నారు. అందులో ఒకటి అఘోరా పాత్ర. ఇదిలా వుంటే ఈ చిత్రంలో విలన్‌గా శ్రీకాంత్‌ని ఫైనల్ చేసినట్టు తెలిసింది. ముందు ఈ పాత్ర కోసం సోనుసుద్‌ని అనుకున్నారు. అయితే సోను ఈ పాత్ర కోసం 3.5 కోట్లు డిమాండ్ చేశారట. దాంతో అంత పారితోషికం ఇవ్వడం ఇష్టం లేక ఆ పాత్రలో శ్రీకాంత్‌ని ఫైనల్ చేసినట్టు తెలిసింది.