
ప్రముఖ నటుడు శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర రావు నిన్న అర్ధరాత్రి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా శ్వాసకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి 11.45 నిమిషాలకు ఊపిరి తిత్తుల వ్యాధి వల్ల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో శ్రీకాంత్ మరియు అతని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
పరమేశ్వర రావుకు భార్య ఝాన్సీ లక్ష్మి ఉన్నారు. వీరికి ముగ్గురు సంతానం. కుమార్తె నిర్మల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్ మరియు అనిల్. శ్రీకాంత్ నివాసానికి పరమేశ్వర రావు గారి పార్దీవ దేహాన్ని తరలించారు. అక్కడే కుటుంబ సభ్యుల, శ్రేయోభిలాషుల సందర్శనార్ధం ఉంచుతారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
పరమేశ్వర రావు గారి స్వస్థలం కృష్ణ జిల్లాలోని మేక వారి పాలెం. తర్వాత వ్యాపార రీత్యా కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలేనికి మకాం మార్చారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు పరమేశ్వర రావు గారిని సందర్శించి శ్రీకాంత్ కు ధైర్యాన్ని చెబుతున్నారు.
100కు పైగా సినిమాలు చేసిన శ్రీకాంత్ ప్రస్తుతం మార్షల్, కోతల రాయుడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
టాలీవుడ్.నెట్ తరుపున శ్రీకాంత్ మరియు అతని కుటుంబానికి ప్రఘాడ సానుభూతిని తెలియజేస్తున్నాం.