
అతిలోక సుందరి శ్రీదేవి వెండితెరపై కనిపిస్తే చాలాని, ఆ సినిమా హిట్టనే మాట అప్పట్లో వినిపించేది. అంటే అంతగా శ్రీదేవి ఆరాధించేవారన్నమాట. గ్లామర్ హీరోయిన్‌గా, నటిగా, హీరోలకు ధీటుగా యాక్షన్ సన్నివేశాల్లో నటించిన శ్రీదేవి అప్పట్లో ఇండియన్ తెరపై తొలి లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది.
తెలుగులో చంద్రమోహన్ నుంచి ఎన్టీఆర్ వరకు అందరు హీరోల సరసన నటించి తీరుగులేదని నిరూపించుకుంది.ఆ తరువాత బాలీవుడ్‌కు వెళ్లినా అక్కడా తన సత్తాను చాటింది. బిగ్ బి టూ అందరి హీరోలో కలిసి నటించి అక్కడ కూడా సూపర్‌స్టార్ అనిపించుకుంది. ప్రమాద వశాత్తు దుబాయ్‌లో మరణించారామె. తాజాగా శ్రీదేవి ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంప్రదాయ బద్ధమైన దుస్తుల్లో భర్త బోనీకపూర్ ఇద్దరు కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటో ఆకట్టుకుంటోంది.
ఈ ఫొటోని ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ ఫొటో గ్రాఫర్ డబ్బూ రత్నానీ షేర్ చేశారు. ఆ ఫొటోకి `ఒక చిత్రం వెయ్యి పదాల విలువైనది, కానీ జ్ఞాపకాలు అమూల్యమైనవి` అనే క్యాప్షన్‌నిచ్చారు. న్యూ ఇయర్ క్యాలెండర్స్‌తో డబ్బూ రత్నానీ బాలీవుడ్‌లో ఫేమస్‌గా మారిన విషయం తెలిసిందే.