Homeటాప్ స్టోరీస్శ్రీ విష్ణు అర్జున ఫల్గుణ టీజర్ టాక్..!

శ్రీ విష్ణు అర్జున ఫల్గుణ టీజర్ టాక్..!

Sri Vishnu Arjuna Phalguna Teaser Released
 

యువ హీరోల్లో రొటీన్ కు భిన్నంగా వెరైటీ సినిమాలు చేస్తూ ప్రతిభ చాటుతున్నాడు శ్రీ విష్ణు. ఈమధ్యనే రాజ రాజ చోర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు తన నెక్స్ట్ సినిమా టీజర్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తేజా మర్నీ డైరక్షన్ లో శ్రీ విష్ణు, అమృత అయ్యర్ జంటగా వస్తున్న సినిమా అర్జున ఫల్గుణ. ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించింది.

నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను.. అయినా బలైపోవడానికి అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని శ్రీ విష్ణు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇన్నాళ్లు క్లాస్ టచ్ ఉన్న సినిమాలతో వచ్చిన శ్రీ విష్ణు ఈ సినిమాతో మాస్ అటెంప్ట్ చేస్తున్నాడని అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ టీజర్ తో వచ్చిన అర్జున ఫల్గుణ ఆడియెన్స్ నుండి బజ్ ఏర్పరచుకోవడంలో సక్సెస్ అయ్యింది.

- Advertisement -

ఇక ట్రైలర్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీ విష్ణు సినిమాలో కథ ఉంటుందని నమ్మే ఆడియెన్స్ ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ హీరో సినిమా సినిమాకు ప్రయోగాలు చేస్తుంటాడు. ఆచార్య నిర్మిస్తున్న మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అన్వేష్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All