
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా సోమవారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని , డైలాగ్స్ , ఫైట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని అభిమానులు కామెంట్స్ వేస్తుంటే..శ్రీ రెడ్డి మాత్రం ట్రైలర్ యావరేజ్ గా ఉందని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేసే శ్రీ రెడ్డి…రాజకీయ పరంగానే కాక పవన్ సినిమాల ఫై కూడా నెగిటివ్ గా మాట్లాడుతూ..కామెంట్స్ వేస్తూ ఉంటుంది. ఈ తరుణంలో మరోసారి పవన్ ఫై తన ఆగ్రహాన్ని చూపించింది. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ భీమ్లా నాయక్ ట్రైలర్ అనుకున్నంతగా లేదంటూ నెగెటివ్ కామెంట్ చేసింది. అంతేకాదు బిలో యావరేజ్ అంటూ గాలి తీసేసింది. దీంతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై ఎప్పటిలాగానే ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక నిన్న సోమవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గా హైదరాబాద్ లో అట్టహాసంగా జరిపేందుకు ప్లాన్ చేసినప్పటికీ , ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తో వేడుకను వాయిదా వేసుకున్నారు. రేపు బుధువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని యూసఫ్ గూడా లో జరపబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. మలయాళీ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. థమన్ మ్యూజిక్.
