Homeగాసిప్స్ఇద్ద‌రి మ‌ధ్య మీటు ర‌చ్చ మొద‌లైంది!

ఇద్ద‌రి మ‌ధ్య మీటు ర‌చ్చ మొద‌లైంది!

ఇద్ద‌రి మ‌ధ్య మీటు ర‌చ్చ మొద‌లైంది!
ఇద్ద‌రి మ‌ధ్య మీటు ర‌చ్చ మొద‌లైంది!

ఇటీవ‌ల మొద‌లైన మీటూ ఉద్య‌మం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారి ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. దీని ప్ర‌భావం టాలీవుడ్‌ని కూడా ఓ కుదుపు కుదిపేసింది. శ్రీ‌రెడ్డి కార‌ణంగా ద‌క్షిణాదిలో తారా స్థాయికి చేరింది. చాలా మంది మీటూ ఉద్య‌మంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. క‌న్న‌డ న‌టితో పాటు తెలుగు గాయ‌ని చిన్మ‌యి శ్రీ‌పాద కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం పెను వివాదంగా మారింది.

దీని ప్ర‌భావం త‌గ్గ రెండేళ్ల‌వుతోంది. నెల‌, లేదా వారానికి ఎవ‌రో ఒక‌రు మీటూ ఉద్య‌మం గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూనే వున్నారు. తాజాగా నందిని రాయ్ మీటూ ఉద్య‌మంపై చేసిన వ్యాఖ్య‌లు మ‌ళ్లీ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. ఇది సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ప్ర‌బ‌లంగా వుంద‌ని,  అయితే త‌న‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ని స‌ద‌రు సంస్థ‌లు ఎందుకు వెన‌క్కి తీసుకుంటున్నారో ఒక అమ్మాయి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతో వుంద‌ని వెల్ల‌డించింది.

- Advertisement -

దీనిపై శ్రీ‌రెడ్డి త‌న‌దైన స్టైల్లో కౌంట‌ర్ ఇచ్చింది. `ఒక అమ్మాయి ప‌నిచేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రైనా వారిని శృంగారానికి బ‌ల‌వంతం చేస్తే అది కాస్టింగ్ కౌచ్ అంటారు నందిని‌. మీరే డైరెక్ట్‌గా నిర్మాత‌తో శృంగారానికి ఆఫ‌ర్ చేస్తే దాన్ని కాస్టింగ్ కౌచ్ అన‌రు. నీ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు నా స్నేహితురాలివి కాబ‌ట్టి. అయితే ఆ బుజ్జిని మాత్రం మ‌ర్చిపోకు` అని కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. నందిని రాయ్ తెలుగులో సుధీర్‌బాబు న‌టించిన `మోస‌గాళ్ల‌కు మోస‌గాడు` చిత్రంతో పాటు సిల్లీ ఫెల్లోస్‌, మాయా వంటి చిత్రాల్లో న‌టించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All