
శ్రీరెడ్డి… టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌజ్ పేరుతో సంచలనం సృష్టించిన పేరిది. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమల్లో శ్రీరెడ్డి సృష్టించిన ప్రకంపణలు అంతా ఇంతా కాదు. తను సంచలనం కావడం కోసం పట్టపగలు వివస్త్రగా నిలిచి యావత్ దేశ వ్యాప్తంగా హంగామా సృష్టించింది. సందర్భం ఏదైనా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
తాజాగా మరో సారి వార్తల్లో నిలిచింది. తమిళ హీరోయిన్ అమలాపాల్ దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి విడిగా వుంటున్నారు. ఏ.ఎల్. విజయ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కానీ అమలాపాల్ మాత్రం వివాహం చేసుకోకుండా సింగిల్‌గా వుంటూ వరుస వివాదాస్పద చిత్రాల్లో నటిస్తోంది.
గత కొంత కాలంగా అమలా పాల్ పంజాబ్‌కు చెందిన భవీందర్‌సింగ్ తో డేటింగ్ చేస్తోందంటూ వరుస కథనాలు వినిపించాయి. అయినా అమలాపాల్ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ భవీందర్‌సింగ్ ని సీక్రెట్‌గా వివాహం చేసుకుంది. భవీందర్‌సింగ్‌తో లిప్‌లాక్ చేస్తున్న ఫొటోలని షేర్ చేసి మాకు పెళ్లైపోయిందని షాకిచ్చింది. దీనిపై శ్రీరెడ్డి వేసిన పంచ్ మామూలుగా పేలలేదు. డోన్ట్ వర్రీ అమలాపాల్ పంజాబీ భర్త నిను బాగా చూసుకుంటాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు` అని ఫేస్ బుక్ వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ లో వున్న నిఘూడ అర్థం ఏంటని అంతా ఆరాతీస్తున్నారు. కొంత మందేమో ఉ విషయంపై అయినా పచ్చిగా స్పందించే శ్రీరెడ్డి తాజాగా అమలాపాల్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా మరో అర్థాన్ని ఇచ్చేవిగా వున్నాయని నెటిజన్స్ అవాక్కవుతున్నారు.