
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా వణికిపోతుంటే శ్రీరెడ్డి మాత్రం హద్దులుదిటి హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. కరోనా నుంచి తప్పించుకోవాలంటే శృంగారంలో పాల్గొనడమే దీనికి మందు అంటూ కామెంట్ చేసి పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వుందంటూ హడావిడి చేసి పట్టపగలు అర్థనగ్నంగా నిలుచుని జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించి వార్తల్లో నిలిచింది.
ఆ తరువాత జనపేనా అధినేత, స్టార్ హీరో పవన్‌కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగిన శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. అక్కడి నుంచి సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై విమర్శలు చేస్తూనే వుంది. తాజాగా మళ్లీ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌లపై హద్దులు దాటి కామెంట్‌లు చేయడం సంచలనంగా మారింది.
వల్గర్ లాంగ్వేజ్‌ని వాడుతూ స్టార్ హీరోయిన్‌లు సమంత, త్రిషలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ చెప్పరాని మాటల్లో ఈ ఇద్దరు తారలపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. బాడీ షేమింగ్ కి మించి ఈ వ్యాఖ్యలు వుండటంతో నెటిజన్స్ శ్రీరెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు. పబ్లిసిటీ కోసం మరీ ఇంతగా దిగజారాలా? అంటూ మండిపడుతున్నారు. మరి దీనిపై సామ్, త్రిష ఎలా స్పందిస్తారో చూడాలి.