Homeటాప్ స్టోరీస్మెగా ఫ్యామిలీ లో ఒకరు శ్రీరెడ్డి కి బాగా క్లోజట

మెగా ఫ్యామిలీ లో ఒకరు శ్రీరెడ్డి కి బాగా క్లోజట

sri reddy comments on prajarajyam partyమెగా ఫ్యామిలీ లో ఒకరు నాకు బాగా క్లోజ్ …… అతడు చెప్పిన దాని ప్రకారం ప్రజారాజ్యం పార్టీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని , ఆ సంగతి చెబితే అందరూ అవాక్కవడం ఖాయం ….. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రివీల్ చేస్తా ” అని సంచలన కామెంట్ చేస్తోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉందని భావిస్తున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పై మెగా కుటుంబం పై అస్త్రాన్ని ఎక్కుపెట్టింది శ్రీ రెడ్డి .

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటనలో ఉన్నాడు , అక్కడ ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుండటంతో మెగా అభిమానులు సంతోషంగా ఉండగా ఆ సంతోషాన్ని ఎక్కువ సేపు ఉంచకుండా నీళ్లు చల్లేస్తోంది శ్రీ రెడ్డి . 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే . అందులో పవన్ కళ్యాణ్ యువ రాజ్యం అధ్యక్షుడి గా ఉన్నాడు అలాగే అల్లు అరవింద్ ముఖ్య భూమిక పోషించాడు . కట్ చేస్తే ఎన్నికల సమయం నాటికి ప్రజారాజ్యం పార్టీ టికెట్ల ని అమ్ముకుంటోంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దాంతో ఘోర పరాజయం పాలయ్యింది ఆ పార్టీ కట్ చేస్తే …… తక్కువ సమయంలోనే ఆ పార్టీ జెండా కూడా పీకేశారు . ఇక ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి . అప్పటి విషయాలు త్వరలోనే చెబుతా అంటూ సోషల్ మీడియాని హీటెక్కించింది . దాంతో మెగా ఫ్యాన్స్ శ్రీ రెడ్డి పై ఆగ్రహంగా ఉన్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All