Homeఎక్స్ క్లూసివ్పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానంటున్న శ్రీ రెడ్డి

పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానంటున్న శ్రీ రెడ్డి

Sri reddy challenges to Pawan kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నుండి పోటీచేసిన నేను అక్కడికి వెళ్లి మరీ ఓడిస్తానని సవాల్ విసురుతోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ని అలాగే మెగా కుటుంబంని శ్రీ రెడ్డి టార్గెట్ చేసిన విషయం తెలిసిందే . అయితే ఇన్నాళ్లు సైలెంట్ అయిపోవడంతో చెన్నై వెళ్ళింది కదా ! ఇక పవన్ కళ్యాణ్ జోలికి రాదేమో అనుకున్నారు కట్ చేస్తే ….. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ పవన్ పై విరుచుకుపడుతోంది శ్రీ రెడ్డి .

ఆంధ్రప్రదేశ్ లో 2019 మేలో శాసనసభ కు ఎన్నికలు జరుగనున్నాయి దాంతో పవన్ కళ్యాణ్ జనసేన ని బలోపేతం చేయడానికి గత ఆరునెలలుగా ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే . అలాగే ఫిబ్రవరిలో ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నాడో స్పష్టం చేస్తానని తెలిపాడు పవన్ అంతే ! నువ్ ఎక్కడ నుండి పోటీ చేసినా వదిలేది లేదు , అక్కడికి వస్తా నిన్ను ఓడిస్తా అంటూ మంగమ్మ శపథం చేస్తోంది శ్రీ రెడ్డి .

English Title: Sri reddy challenges to Pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All