
ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రం నిన్న విడుదలైంది. కిరణ్ అబ్బవరం హీరోగా చేయగా ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. తొలిరోజు డీసెంట్ టాక్ ను తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా అందరినీ సర్ప్రైజ్ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో థియేటర్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి.
కాకపోతే ఆంధ్రప్రదేశ్ తోనే వచ్చింది సమస్య అంతా. ఏపీలో నైట్ కర్ఫ్యూ కారణంగా మూడు షోస్ మాత్రమే వేసుకునే వీలుంది. అలాగే ఇక్కడ టికెట్ల ధరలు కూడా బాగా తగ్గించేశారు. అయినా కూడా ఎస్ఆర్ కళ్యాణమండపం డీసెంట్ ఫిగర్స్ ను నమోదు చేసింది. ఈ చిత్రం మొదటి రోజు 1.60 కోట్ల షేర్ ను రాబట్టింది. వీకెండ్ వరకూ ఇదే ఫ్లోను కంటిన్యూ చేస్తే చిత్రం సేఫ్ అవ్వడం ఖాయం.
తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలు చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలకు కొంత హోప్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు మరిన్ని సినిమాలు విడుదల చేసుకోవడానికి ధైర్యం వచ్చినట్లైంది.