Homeటాప్ స్టోరీస్మెగాస్టార్ పుట్టినరోజుకు స్పెషల్ సర్ప్రైజ్ లు రెడీ అవుతున్నాయట

మెగాస్టార్ పుట్టినరోజుకు స్పెషల్ సర్ప్రైజ్ లు రెడీ అవుతున్నాయట

మెగాస్టార్ పుట్టినరోజుకు స్పెషల్ సర్ప్రైజ్ లు రెడీ అవుతున్నాయట
మెగాస్టార్ పుట్టినరోజుకు స్పెషల్ సర్ప్రైజ్ లు రెడీ అవుతున్నాయట

మెగాస్టార్ చిరంజీవి ఆగష్టు 22న తన పుట్టినరోజును జరుపుకోనున్న విషయం తెల్సిందే. ప్రతీసారిలా ఈసారి మెగా ఫ్యాన్స్ అందరూ హంగామా చేయడానికి లేదు. ప్రస్తుతం సోషల్ డిస్టెన్సిన్గ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడి ఫంక్షన్ లు చేసుకోకూడదు. అలా అని చెప్పి మెగాస్టార్ అభిమానులు ఊరుకుని ఉండలేరుగా. అందుకే సోషల్ మీడియాలో రచ్చ చేయడానికి ఇప్పటినుండే హంగామా మొదలుపెట్టేసారు.

ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ప్రతీ హీరో పుట్టినరోజుకు ఒక కామన్ డిస్ప్లే పిక్చర్ విడుదల చేయడం ఆనవాయితీ. అయితే మెగాస్టార్ చిరంజీవి సీడీపీను ఒక బాలీవుడ్ స్టార్ హీరో చేత విడుదల చేయించబోతున్నారు మెగాస్టార్ అభిమానులు. అలాగే చిరంజీవి మీద ఒక పాటను కూడా రిలీజ్ చేయబోతున్నారు.

- Advertisement -

అలాగే మాకు అందిన సమాచారం ప్రకారం చిరంజీవి ప్రస్తుతం నటిసోన్న ఆచార్య సినిమా అప్డేట్ కూడా విడుదల కాబోతోందని సమాచారం. అప్పటి పరిస్థితిని బట్టి ఈ చిత్ర మోషన్ పోస్టర్ లేదా టైటిల్ లోగో లేదా రెండూ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All