
అత్యధి భారతీయ భాషల్లో తర గానామృతాన్ని అందించి అసంఖ్యాది ప్రేక్షకుల్ని అలరించిన ఏకైక గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఏ హీరోకు పాడితే ఆ హీరో గొంతుని అనుకరించడం బాలు ప్రత్యేకత అదే ఆయనని మహోన్నత గాయకుడిగా నిలబెట్టింది. అమ్మాయిలా, బామ్మలా తనదైన శైలి గాత్రాన్ని అందించి ఐదు దశాబ్దాల పాటు భారతీయ సంగీత సామ్రాజ్యాన్ని శాసించారు. ఆగస్టు 5న కరోనా లక్షణాలతో ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు ఈ శుక్రవారం 40 రోజుల పాటు పోరాడి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
ఆయన మృతి పట్ల యావత్ భారతీయ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ పరిశ్రమ బాలు రూపంలో బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయింది. ఆయన మృత దేహాన్ని సాయంత్రం 4 గంటలకు ఎంజీఎం ఆసుపత్రి నుంచి చెన్నైలోని మహాలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. శనివారం ఉదయం వరకు బాలుభౌతిక కాయం ప్రముఖుల దర్శనార్ధం ఇంటి వద్దే వుండనుంది.
శనివారం ఉదయం అభిమానుల సందర్శనార్థం బాలు భౌతిక కాయాన్ని సత్యం థియేటర్ ఆవరణలో వుంచనున్నారు. ఇందు కోసం భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం రెడ్‌డ్ హిల్స్‌లోని ఫామ్ హౌస్‌లో అత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు మొదలుపెట్టినట్టు తెలిసింది.