
లెజండరీ సింగర్, ఫిల్మ్ పర్సనాలిటీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనల్ని విడిచి ఏడాది దాటిపోయింది. ఆయన విడిచి వెళ్ళిపోయినా కానీ ఆయన పాటలతో మనలో జీవించే ఉన్నారు. దశాబ్దాలుగా విజయవంతంగా సాగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కెరీర్ లో ఎన్నో వేల పాటలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆఖరి పాట రీసెంట్ గా విడుదలైంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల్లో ఇంట్రడక్షన్ సాంగ్ ను పాడటం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఆనవాయితీ. రజినీకాంత్ లేటెస్ట్ సినిమా అన్నాత్తే ఇంట్రడక్షన్ సాంగ్ ను కూడా బాలు పాడటం జరిగింది. ఆయన అనారోగ్యం పాలవ్వకముందే ఈ సాంగ్ ను రికార్డ్ చేసారు.
2021 దీపావళికి విడుదల కానున్న ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ అన్నాత్తే అన్నాత్తేను ఇటీవలే విడుదల చేయగా అది టాప్ లో ట్రెండ్ అవుతోంది. బాలు మిగతా పాటల్లాగే ఈ సాంగ్ కు కూడా పూర్తి స్థాయి న్యాయం చేసాడు. శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.