Homeటాప్ స్టోరీస్సౌందర్య రెండో పెళ్లి చేసుకునేది ఇతడినేనంట

సౌందర్య రెండో పెళ్లి చేసుకునేది ఇతడినేనంట

soundarya second marriage news goes viralసూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు రెండో పెళ్లి కి సిద్ధమైంది అన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి . రజనీ రెండో కూతురు సౌందర్య ఇంతకుముందు అశ్విన్ అనే వ్యక్తి ని 2010 లో పెళ్లి చేసుకుంది , వాళ్లకు ఒక బాబు కూడా . బాబు పుట్టిన వెంటనే ఇద్దరూ విడిపోయారు . అశ్విన్ నుండి విడాకులు తీసుకుంది సౌందర్య . ఈ ఇద్దరినీ కలపడానికి రజనీకాంత్ ఎన్నో ప్రయత్నాలు చేసాడు కానీ కుదరలేదు దాంతో విడిపోయారు . కట్ చేస్తే ఇపుడు విసాఖన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది . సౌందర్య కు ఇది రెండో పెళ్లి కాగా వైశాఖన్ కు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం .

వైశాఖన్ కుటుంబం వ్యాపారస్తుల కుటుంబం అలాగే వైశాఖన్ కు యాక్టింగ్ అంటే ఆసక్తి దాంతో చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తున్నాడు . సౌందర్య కు డైరెక్టర్ గా సక్సెస్ కొట్టాలని ఆశ కానీ చేసిన రెండు చిత్రాలు కూడా ఘోర పరాజయం పొందాయి . ఒకటి కొచ్చాడైయాన్ కాగా రెండోది వి ఐ పి 2 . రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి . కట్ చేస్తే ఈ ఇద్దరికీ కుదరడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు . ఇటీవలే వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందట , వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నారట . ఇక ఇతడే సౌందర్య ని చేసుకునే వాడు అంటూ , రజనీకాంత్ చిన్నల్లుడు అంటూ ఓ ఫోటో వైరల్ అవుతోంది , అది ఇదే .

- Advertisement -

English Title: soundarya second marriage news goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All